

జనం న్యూస్ మార్చి 04 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్ట్- మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) అనుబంధ ఉద్యోగ సంఘం అయిన మాదిగ ఉద్యోగుల సమాఖ్య (మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ -ఎం ఇ ఎఫ్ ) జిల్లా ఉపాధ్యక్షులు (వైస్ ప్రెసిడెంట్) గా సూర్యాపేట జిల్లా,మునగాల మండలం, తాడ్వాయి గ్రామ వాసి,..మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తాడ్వాయి తండా ప్రధానోపాధ్యాయులు డాక్టర్.నెమ్మాది ఉపేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రం లోని ఐ బి ఎస్ సెమినార్ హాల్ నందు జిల్లా నూతన కమిటీ ఎన్నిక సమావేశం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు మంద దేవేంద్ర ప్రసాద్, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్. కత్తి వెంకటేశ్వర్లు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న, రాష్ట్ర కోశాధికారి చింత జాన్విల్సన్,రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉట్కూరు జానకిరాములు హాజరయ్యారు.రాష్ట్ర అధ్యక్షులు మంద దేవేంద్ర ప్రసాద్, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, రాష్ట్ర నాయకత్వం సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు మంద దేవేంద్ర ప్రసాద్,జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్. కత్తి వెంకటేశ్వర్లు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న, రాష్ట్ర కోశాధికారి చింత జాన్విల్సన్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉట్కూరు జానకిరాములు మరియు ఇతర జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా డాక్టర్. నెమ్మాది ఉపేందర్ మాట్లాడుతూ..మాన్యులు, పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ అన్న గారి నాయకత్వం లో,ఎస్సీ ల ఏబిసిడి వర్గీకరణ సాధించటం తో పాటు దళిత, గిరిజన, బడుగు, బలహీన, వెనుక బడిన వర్గాల,..బహుజన సమాజ శ్రేయస్సు కై జరిగే ఉద్యమాలు,పోరాటాలలో తన మేధస్సు,కలము, గళము తో తన వంతు పాత్ర ను పోషిస్తానని అన్నారు.