Listen to this article

తహసీల్దార్ కు జీపీ సెక్రటరీ కి వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు. పేసా చట్టం రాయి సెంటర్ సభ్యులు అధికారులకు పిర్యాదు… జనం న్యూస్ పీబ్రవరి ఆసిఫాబాద్ 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం అందుగుల గూడా గ్రామపంచాయతిలో పేసా చట్టం ప్రకారం, ఏజెన్సీ పరిధిలోకి వస్తుంది, క్రయవిక్రయాలు జరుపరాదు, గత నాలుగు రోజులనుండి క్రయవిక్రయాలు జరిగినట్లు గ్రామస్తులకు తెలియగానే గ్రామపంచాయతీ సెక్రటరీ వెంట్రావు దృష్టికి వెళ్లగా వెంటనే స్పంధించి క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టాగా అట్టి భూమి ప్రభుత్వ భూమి వ్యవసాయం చేసుకొని జీవనోపాది కోసం ఇచ్చిన భూములని, డబ్బా —బెజ్జుర్ ప్రధాన రహదారికి అనుకోని పర్దాన్ గూడ దగ్గరవ్యసాయభూమిని ఏజెన్సీ పరిధిలోనీ భూములు క్రాయావిక్రయాలు జరుప రాదని, స్థలము వద్ద వెళ్లి చూడగాగుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్లతో నల్ల మట్టి, మొరం రోడ్డుకు సమానంగా నింపుతున్నారని వారు కొత్తవ్యక్తులుగా ఉన్నారని కార్యదర్శి చెప్పారు. వెంటనే గ్రామస్తులు అందరు ఐక్యత అయి తీర్మానం ప్రవేశపెట్టిసెక్రటరీ కి ఇచ్చారు. వెంటనే స్పందించి పై అధికారులకు గ్రామస్తులతో కలిసి ఏం ఆర్ ఓ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్య క్రమంలో పేసా చట్టం అధ్యక్షులు సిడెం బాబురావు, ఎర్మా నారాయణ తలండి ఈశ్వర్, ఉప సర్పంచ్, కొమరం శ్రీనివాస్, ఆలం మధుకర్, గేడం నందరం, కోరే త సుధాకర్, విజయ్ సెక్రటరీ వెంకట్రావు తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.