

జనం న్యూస్ 04 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ సౌమ్యుడు… అందరివాడు… సేవాళీలి… గాదె శ్రీనివాసుల నాయుడుకు గురువులు మరోసారి జై కొట్టారు. ఉపాధ్యాయ శాసనమండలి సభ్యునిగా అఖండ విజయాన్ని చేకూర్చి విజయ తిలకాలను దిద్దారు. అత్యంత ఉత్కంఠ భరితమైన ఎన్నికల కౌంటింగ్ నెలకొన్న పరిస్థితుల్లో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో గాదె జై కొట్టడం నిజంగా చరిత్రగా చెప్పవచ్చు గతంలో రెండుసార్లు ఉపాధ్యాయ శాసనమండలికి ఎన్నికైన గాదె శ్రీనివాసుల నాయుడుకు ఆరేళ్ల విరామం తర్వాత మరోసారి ఉపాధ్యాయులు శాసన మండలి సభ్యునిగా రెండో ప్రాధాన్యత ఓట్ల ఆధిక్యతతౌ గాదె ను గెలవడం ఉపాధ్యాయ వర్గంలో ఆనందం వెల్లివిరిసింది. స్వతహాగా గాదె శ్రీనివాసుల నాయడు అందరిని కలుపుకుపోయే మనస్తత్వం గలవారు. ఎటువంటి సహాయాన్ని కోరినా వీలైనంతవరకు తన శక్తి మేరకు సహకరించే సేవా తత్పరతకు నిదర్శనంగా నిలిచారు. ఎన్నిక వరకే వర్గాలు గాని ఎన్నిక అనంతరం అందరూ సమానమే నన్న భావనతో ఆయన ఉపాధ్యాయ సమస్యలను తీర్చడంలో దిట్టగా పేరుగాంచారు. శాసనమండలి సభలో తన వాణిని గట్టిగా వినిపించి అనుకున్న లక్ష్యాలను నెరవేర్చడంలో ఎందరో ఉద్దండలను మైమరిపించిన యోధుడిగా ఉపాధ్యాయ వర్గంలో పేరు తెచ్చుకున్నారు. మంచితనం, ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించడం, ఇత్యాది అంశాలే ఆయనకు మరోసారి విజయానికి దోహదకారిగా నిలిచింది .ముఖ్యంగా ప్రైవేటు ఉపాధ్యాయులు ఆయన విజయానికి వెన్నెముకగా నిలిచారని ఉపాధ్యాయ వర్గాల్లో గట్టిగా వినిపించిన వాదన.” ఏది ఏమైనప్పటికీ మరోసారి విజయనగరవాసి శాసనమండలి సభ్యునిగా అడుగుపెట్టడం విజయనగర ప్రాంతీయులకు ఎంతో ఆనందంగా ఉందనే చెప్పాలి. ఉపాధ్యాయ సమస్యలతో పాటు స్థానిక సమస్యల పరిష్కారం కూడా ఆయన గళాన్ని శాసనమండలిలో వినిపిస్తారన్న అభిప్రాయాన్ని సర్వత్రా వ్యక్తం అవుతోంది.