

జనం న్యూస్ 04 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ చదవాలన్న సంకల్పం ముందు మానసిక అంగవైకల్యం తలవంచింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వి.ఎం.పేటకు చెందిన పెట్ల మానస ఇంటర్ పరీక్షలకు హాజరైంది. చిన్నప్పటి నుంచి మానసికస్థితి సరిగా లేకపోయినా తల్లిదండ్రుల సాయంతో చదువు కొనసాగిస్తోంది. ప్రస్తుతం HEC సెకండియర్ చదువుతున్న మానస… తన తండ్రి దేముడు సాయంతో సోమవారం పరీక్షకు హాజరయ్యింది. సహాయకురాలి సాయంతో పరీక్ష రాసింది. ఆమె ఆత్మ స్థెర్యానికి సెల్యూట్ చేయాల్సిందే.