

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 04 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మద్యం సేవించి వాహనాలు నడిపి, పట్టుబడితే.. నేరాన్ని న్యాయ స్థానాలు తీవ్రమైన పరిగణించి, ఇటీవల కాలంలో వాహనదారులు ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా విధిస్తున్నారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మార్చి 3న తెలిపారు.జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో విజయనగరం ట్రాఫిక్ సిఐ సూరి నాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, మద్యం సేవించి, వాహనాలు నడిపిన వారిపై 62 కేసులు నమోదు చేసారన్నారు. పట్టుబడిన వాహనదారులను మార్చి 3న విజయనగరం అడిషనల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వారి వద్ద హాజరుపర్చగా, ఎ.జె.ఎఫ్.సి.ఎం. మెజిస్ట్రేట్ శ్రీమతి బి.రమ్య గారు ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున మొత్తం రూ.6.20 లక్షలను జరిమానగా విధించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవ్వడం లేదా ఇతర వాహనాలను ఢీ కొట్టి ప్రమాదాలకు కారకులవుతున్నారన్నారు. ఈ తరహా వాహనదారులను కట్టడి చేసేందుకు, ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రతీ రోజూ నిర్వహిస్తున్న విజిబుల్ పోలీసింగులో భాగంగా ప్రత్యేకంగా డ్రంకన్ డ్రైవ్ చేపట్టి, డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతూ, మద్యం సేవించి, వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.