Listen to this article

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్. పుల్లూరి స్వప్న సదానందం. జనం న్యూస్ // మార్చ్ // 4 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట మండల పరిధిలోని విల్లాసాగర్, గండ్రపల్లి, తనుగుల, వావిలాల, గ్రామాల మానేరు నది పరివాహక ప్రాంతం నుండి అక్రమంగా ఇసుకను తవ్వి రవాణా చేస్తున్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం అన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో వారు మాట్లాడుతూ మానేరు పారివాహక ప్రాంతం గ్రామ ప్రజలు, రైతులు, అక్రమంగా మానేరు నుండి ఇసుక తీయడం వలన భూగర్భ జలాలు అడుగంటి మానేరు వాగును అనుకొని ఉన్న రైతుల పంట పొలాలకు నీరు అందక పంట పొలాలు ఎండుతున్నాయని ఇప్పటికైనా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి మానేరు పరివాహక ప్రాంతం నుండి ఇసుకను అక్రమంగా తవ్వకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు మా దృష్టికి మా పాలకవర్గం దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.అక్రమంగా ఇసుకను తరలించే ట్రాక్టర్లు అతివేగంతో నడుపుతూ అనేక ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయని, ఈ మధ్యకాలంలో అతివేగం వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ మధ్యకాలంలో ఒక కుటుంబం పెద్ద చనిపోయి ముగ్గురు పిల్లలు అనాధలు అయ్యారని, వాహనాలను ఎలాంటి పేపర్లు లేకుండా, పేపర్లు ఉన్న ట్రాక్టర్ యజమాన్యం ఆర్టిఏ అధికారులు అతివేకంగా వెళ్లకుండా ట్రాక్టర్లకు లాకులు బిగించిన, ఆ లాకులను తొలగించి అధిక వేగంతో. టాక్టర్లను నడుపుతూ అనేక ప్రమాదాలకు కారణం అవుతున్నారని, ఈ విషయమై రైతులు స్వయంగా రెవెన్యూ అధికారులకు పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చినా కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏంటని చైర్మన్ అన్నారు. ఈ అక్రమ రవాణా పై జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ , ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్, నియోజకవర్గం ఇంచార్జ్ ప్రణవ్ బాబు దృష్టికి తీసుకెళ్లి అక్రమంగా ఇసుకను తవ్వుతూ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. జమ్మికుంట మండల రెవెన్యూ అధికారులు పోలీస్ సిబ్బంది మైనింగ్ అధికారులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లు వారికి ప్రోత్సహిస్తున్నారు తప్ప అక్రమ ఇసుకను రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని అన్నారు. ఇప్పటికైనా స్థానిక అధికారులు అక్రమ రవాణా చేసే వారి పైన ఉక్కు పాదం మోపి రైతుల పొలాలు ఎండిపోకుండా, పొలాలకు నీటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే అతివేగంతో నడిపే ట్రాక్టర్లను గుర్తించి ఆ వాహనాలు సీజ్ చేయాలని వారు అధికారులను కోరారు.