Listen to this article

జనం న్యూస్ : జనవరి 11 యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట
రాజాపేట మండలంలోని బేగంపేట వాగు మీద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంలో ఉండగా రాకపోకలకు వేసిన పైపులు కొట్టుకుపోయాయని వెంటనే కల్వర్టు నిర్మించాలని సిపిఐ మండల కార్యదర్శి చిగుళ్ల లింగం శనివారం డిమాండ్ చేశారు. గంధ మల్ల చెరువు నుండి వాగు వద్ద వేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయిందని దీంతో రాజపేట మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయని శనివారం సందర్శించి విలేకరులతో మాట్లాడారు. వాగు మీద  హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం  జరుగుతుండగా  పక్క నుంచి దారి తీశారని,  నామమాత్రంగా పైపులు వేసి  మట్టి పోశారన్నారు .  ఇటీవల  గంధమల చెరువులోకి  నీరు భారీగా వచ్చి  అది నిండుకొని  వాగు ద్వారా  చెరువులు  నింపేందుకు  వదులుతు0డగా,  ఆ నీటి తాకడికి పోసిన మట్టి పైపులు  కొట్టుకుపోవడంతో గ్రామస్తులకు   రాకపోకలకు  ఇబ్బందులు పడుతున్నారన్నారు.గంధ మల్ల మీది నుంచి  రాజపేటకు  అదనంగా పది కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.బ్రిడ్జి నిర్మాణం చేసే ముందు  రాకపోకలకు ఇబ్బందులు లేకుండా  పక్కన కల్వర్టు  నిర్మించి  హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టాలి కానీ  కాంట్రాక్టర్  అలా చేయకుండా  నామమాత్రంగా పైపులు వేసి  పనులు మొదలు పెట్టాడని,  ఆ పనులలో  నాణ్యత లేకుండా  ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని   ఆరోపించారు.  రెండు నెలలు  పనులు కొనసాగుతాయని   ఉన్నతాధికారులు పర్యటించి  ప్రజలు ఇబ్బందులు తెలుసుకొని  సమస్య పరిష్కారం చూపాలని  కోరారు. హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు  చేపట్టినప్పటి నుండి  నాలుగు సార్లు నీళ్లు వదలడంతో  వేసిన పైపులు కొట్టుకుపోయాయని  ఆయన  తెలిపారు.  నీళ్లు తగ్గితేనే  మళ్లీ పైపులు వేస్తా అని  కాంట్రాక్టర్ అంటున్నారని  సంక్రాంతి  పండుగకి ముందు  ప్రజలు  ఇబ్బందులు పడుతున్నామని  రాకపోకలకు  ఇబ్బందులు లేకుండా  వెంటనే పైపులు వేయాలని  ప్రజలు కోరుతున్నారు.  నీళ్లు వదిలే అధికారులు  బ్రిడ్జి నిర్మాణం చేసే అధికారులకు  సమన్వయ లోపంతో  ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని తెలిపారు.