Listen to this article

పయనించే సూర్యుడు: మార్చి05: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి.ఎ. ములుగు: ములుగు జిల్లా ఇంచెర్ల గ్రామానికి చెందిన కుంచం రమేష్ గత కొంత కాలంగా v6ఎలక్ట్రానిక్ మీడియాలో రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కేన్సర్ వ్యాధితో బాధపడుతూ మంగళవారం ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈసంఘటన తెలుసుకున్న
రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క , కుంచం రమేష్ కుటుంబానికి అండగా ఉంటామని, రిపోర్టర్ కుంచం రమేష్ మృతి తీరని లోటని ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోతూ, ప్రజల పక్షాన నిలిచారని ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి వర్యులు సీతక్క ప్రార్థించారు.