

రేపటి నుంచి ఆన్లైన్, జిరాక్స్ సెంటర్ మూసివేత… జుక్కల్ మార్చి 4 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా
జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో రేపటి నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి కావున జిరాక్స్ సెంటర్లు, ఆన్లైన్ సెంటర్లు మూసివేయాలని ప్రభుత్వ ఆదేశాలనుసారము నోటీసులు జారీ చేయడం జరిగిందని ఎస్ఐ విజయ కొండ తెలిపారు. ఈ సెంటర్లకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జిరాక్స్, ఆన్లైన్ సెంటర్లు మూసివేయాలని నోటీసులో తెలపడం జరిగింది ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ నడుస్తున్న సమయంలో ఈ జిరాక్స్ సెంటర్లు గానీ ఆన్లైన్ సెంటర్లు గానీ నడపడానికి వెళ్లలేదని తెలిపారు.