

అరెస్ట్ అయిన అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలి. సిఐటియు డిమాండ్. జుక్కల్ మార్చి 4 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలను రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను ప్రజావాణిలో ప్రజా దర్బార్ హైదరాబాదులోని ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడానికే బయలుదేరుతున్న మినీ అంగన్వాడీ లతోపాటు అంగన్వాడి టీచర్స్ లను ప్రభుత్వం పోలీసుల చేత అక్రమ అరెస్టు పాల్పడుతుందని మినీ అంగన్వాడీల గత 11 నెలలుగా పెండింగ్లో ఉన్న మినీ అంగన్వాడీల ఏరియర్స్ వేతనాలను విడుదల చేయాలని మరియు పెరిగిన వేతనాలు వెంటనే అమలు చేయాలని ప్రజా దర్బార్ ప్రజావాణిలో వినతి పత్రాలు ఇవ్వడానికి బయల్దేరు వెళుతున్న మినీ టీచర్లతో పాటు అంగన్వాడీలను అక్రమంగా. రాత్రి నుండే హౌసా రెస్టులు. చేస్తూ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారని అంగన్వాడీల పైన మీరు బందఖండను ఆపాలని. కామారెడ్డి జిల్లా అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు. సురేష్ అన్న. రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు మంగళవారం రోజు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పోలీసులు అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ నిర్బంధ పాలనకు తెరతీస్తోందన్నారు. ప్రజా పాలన అంటున్న ముఖ్యమంత్రి గారు అంగన్వాడీలను అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నించారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాల్సిపోయి అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం. నిర్బంధాన్ని ప్రయోగించడం చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కాదని ఆయన అన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అరెస్ట్ చేసిన అంగన్వాడీలను వెంటనే భేషరతు గా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

