Listen to this article

1/70 యాక్టు,పిసా చట్టాలకు వ్యతిరేకం గా బహుళ అంతస్థులు మార్చి 4 జనంన్యూస్ వెంకటాపురం మండలపి ప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వెంకటాపురంమండలం లో ఆదివాసి సంక్షేమ పరిషత్ మంగళవారం వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల అధ్యక్షులు తుర్స కృష్ణ బాబు మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్ భూభాగంలో ఉన్న 1/70,పీసా చట్టాలకు వ్యతిరేకంగా వెంకటాపురం (Z) సర్వేనెం 4/1,4/2,68,69 ప్రభుత్వ భూములను కబ్జా చేసి క్రయాయిక్రయాలు చేస్తూ భూదందా కి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.ఏజన్సీ చట్టాలను, కఠినంగా అమలు చేయాల్సిన రెవిన్యూ ఆఫీసర్లు సర్కార్ పెద్దలు కుమ్మక్కై ప్రభుత్వ భూములను కబ్జా చేసి భూదందాకు తెరలేపారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటాపురం మండల కేంద్రంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి దర్జాగా బహుళ అంతస్తులు నిర్మిస్తుంటే వెంకటాపురం మేజర్ గ్రామపంచాయతీ,రెవెన్యూ వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వెంకటాపురం (Z) సర్వే నెంబర్లలో సమగ్ర విచారణ జరిపి కబ్జాకు పాల్పడిన గిరిజనేతరులపై ఎల్.టి.ఆర్ కేసులు నమోదు చేసి ఆ ప్రభుత్వ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భూములేని నిరుపేద ఆదివాసులకు పంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల ఉపాధ్యక్షులు తాటి రాంబాబు, బొగ్గుల రాజ్ కుమార్, సంపత్, పూనెం అర్జున్, నవదీప్ తదితరులు పాల్గొన్నారు.