

జనం న్యూస్,పార్వతీపురం మన్యం జిల్లా,, మార్చి 4, (రిపోర్టర్ ప్రభాకర్):
రక్తదానం ప్రాణదానం తో సమానమైనదని జిల్లా కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ అన్నారు. మంగళవారం లైన్ మేన్ దివాస్ పురస్కరించుని ఎ పి డి సి ఎల్ ఆధ్యర్యంలో కార్యాలయ వద్ద నిర్వహించిన ‘నేను సైతం ‘ రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు రక్త దానం చేయడం వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడవచ్చన్నారు. రక్త దానంకి మించిన దానం లేదని పేర్కొన్నారు. ప్రతీ ఆరు మాసాలకు రక్తదానం చేయవచ్చని అపోహలు వీడి రక్త దానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రోగులకు ప్రమాదకర సమయంలో రక్తం కోసం ఆశ్రయిస్తున్నారని తెలిపారు. రక్త నిల్వలు అందుబాటులో ఉంచేందుకు జిల్లాలో నాలుగు బ్లడ్ బ్యాంక్ లను ఏర్పాటు చేసినట్లు ల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తాన్ని అందించేందుకు జిల్లాలో రక్త నిల్వలు పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు మరిన్ని రక్త దాన శిబిరాలు నిర్వహించాలని, యువత రక్తదానం చేసేందుకు ముందుకువచ్చి సేవాభావం పెంపొందించుకోవాలని కోరారు. రక్త దాన శిబిరంలో దాతల నుంచి 89 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు మెడికల్ ఆఫీసర్ తెలియజేశారు. అనంతరం రక్త దానం చేసిన దాతలకు ప్రశంసా పత్రాలను అందించి అభినందించారు. అంతకు ముందు విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలో కలెక్టర్ స్వయంగా మొక్కలను నాటారు. మొక్కల సంరక్షణకు అందరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ పి ఈ పి డి సి ఎల్ పర్యవేక్షక ఇంజనీర్ కె.చలపతి రావు, కార్యనిర్వహక ఇంజనీర్ కె. గోపాల్ రావు నాయుడు, జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా,వాగ్దేవి, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డా,రాజ్ ప్రేమ్, డి ఎల్ వో డా,వినోద్, డిప్యూటీ ఈ ఈ సీహెచ్.వెంకట రమణ, సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.