Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నేటి సమాజంలో విద్యార్థులు విద్యతో పాటు అన్నిరంగాలలో రాణించాలని శ్రీ అన్నమాచార్య అకాడమీ హై స్కూల్ కరెస్పాండంట్ సమ్మెట శివ ప్రసాద్, డైరెక్టర్ మాడపూరి హేమలత పేర్కొన్నారు. RK నాలెడ్జి వారు అబాకస్ మరియు వేదిక్ మాథ్స్ లలో నిర్వహించిన జోనల్ స్థాయి పోటీలలో శ్రీ అన్నమాచార్య అకాడమీ విద్యార్థులు వివిధ కేటగిరిలలో M.సుబ్రహ్మణ్యం, సీవీ.తేజశ్రీ, M.యస్వంత్ ప్రధమ స్థానం మరియు జోయా మెహెక్, G. లక్షిత్ ద్వితీయ స్థానాలలో నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ సమ్మెట ఉమా మహేష్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.