Listen to this article

జనం న్యూస్ మార్చి 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఉభయగోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎన్నికలలో ఘనవిజయం సాధించిన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరo ని మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు. ఈరోజు ఏలూరు సి ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో గణవిజయం సాధించిన రాజశేఖర్ ని స్వీట్స్ తినిపించి సత్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పార్లమెంట్ సభ్యులు పురందేశ్వరి నాయకత్వాన్ని యువతి యువకులు విద్యావంతులు మేధావులు ఇచ్చిన తీర్పు అభినందనలు అభినందనీయమని నాగ జగదీష్ అన్నారు. పట్టుభద్రుల భీమవరం నియోజవర్గానికి పరిశీలికలుగా గత నెల రోజుల నుండి బుద్ధ నాగ జగదీశ్వరరావు* వారి బృందం రాజశేఖర్ విజయానికి కృషి చేసిన విషయం విధితమే ఈ అభినందన కార్యక్రమంలో బోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ కన్నూరుపాలెం టీడీపీ నాయకులు వాసు, కన్నూరు లక్ష్మణరావు,టీడీపీ కాండ్రేగుల గోపికృష్ణ పాల్గొన్నారు.