Listen to this article

వాజేడు మండల అధ్యక్షులుగా కారం చిరంజీవి. రాజ్యాంగ పరిరక్షణ కై B S P తో కలిసిరండి తడికల శివకుమార్ మార్చి 4 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం న B S P పార్టీ మండల ఇంచార్జి కుమ్మరి రాంబాబు ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ మండల నూతన కమిటి ఎన్నుకోవడం జరిగింది అనంతరం బి ఎస్పి పార్టీ తడికల శివకుమార్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణకై బహుజన సమాజ్ పార్టీతో కలిసి రావాలని బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కొత్తగూడెం జిల్లా ఇన్చార్జి, భద్రాచల నియోజకవర్గ అదనపు ఇంచార్జి తడికల శివకుమార్ అన్నారు. మంగళవారం వాజేడు మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ముఖ్య నాయకుల సమీక్ష సమావేశం భద్రాచలం నియోజకవర్గం ఉపాధ్యక్షులు, వాజేడుమండల ఇన్చార్జి కుమ్మరి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి విచ్చేసిన పాత్రికేయుల ముఖాముఖిలో శివకుమార్ మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ. రాజ్యాంగ రక్షణకై పాటు పడుతుందని, రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 12 నుండి 35 వరకు ఉన్న ప్రాథమిక హక్కుల సంరక్షణకై నిరంతరం పోరాడుతుందని తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు ప్రాంతంలో 1950 కి పూర్వం నివసిస్తున్నటువంటి అన్ని వర్గాల ప్రజలని ఎస్టీ జాబితాలో చేర్చాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగపరంగా చెప్పినప్పటికీ పాలక ప్రభుత్వాలు అది నెరవేర్చటంలో వైపల్యం చెంది కొన్ని వర్గాల మధ్య అనేక సమస్యలకు కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఆర్టికల్ 14, ఆర్టికల్ 17, ఆర్టికల్ 21, అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వాటి పరిష్కారం కొరకు బహుజన్ సమాజ్ పార్టీలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఆధిపత్య కులాలలోని పేదలు మహిళలు, బి ఎస్ పి కి రాజ్యాధికారం అందించడం ద్వారా సమస్యలన్ని పరిష్కారం అవుతాయని పునరుద్ఘాటించారు. ఎస్సీ ఎస్టీ బీసీలు మత మైనార్టీలు, బహుజన సమాజ్ పార్టీ చేసే సామాజిక ఉద్యమానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు అనంతరం నియోజకవర్గం అధ్యక్షులు కొండా చరణ్ వాజేడు మండల అధ్యక్షునిగ కారం చిరంజీవి కి నియామక పత్రాన్ని అందించి నియమించారు ఈ సందర్బంగా కొండా చరణ్ మాట్లాడుతూ బహుస్వతు రాజకీయలు వాదానీదేని ఎస్సి ఎస్టీ బీసీ బహుజనులంతా బి ఎస్పీ తో కలిసి రావాలని కోరారు అదేవిధంగా కారం చిరంజీవి తన మండల కమిటి సభ్యులకు నియామక పత్రాలు ఇచ్చి నియమించుకున్నారు వాజేడు మండలఉపాధక్షులుగా దుర్గం దేవసహాయం ప్రధాన కార్యదర్శి గా జనగం కేశవరావు కోశాధికారి జాడి రామకృష్ణ కార్యదర్శి సాధనపల్లి మోహనరావు, మండల ఇ సి మెంబరుగాకుమ్మరి స్వర్ణబాబులను నియమించారు ఈ కార్యక్రమంలోబహుజన సమాజ్ పార్టీ నాయకులు కావేరి మధు సప్పిడి సాంబశివారావు కుమ్మరి ఏసు సప్పిడి రాంబాబు సప్పిడి బాబు ఎస్ కె అజ్జు గజ్జల శివ గజ్జల శేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు