

జనం న్యూస్ మార్చ్(4) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం ఎర్రపాడు స్టేజి వద్ద ఉన్న ఎస్సారెస్పీ కాలువ దగ్గర నూతనకల్ మండలంలోని గ్రామాల రైతులు ఎస్సారెస్పీ కాలువ ద్వారా కాలేశ్వరం గోదారి జలాలు నూతకంలో ఉన్న అన్ని గ్రామాలకు సాగునీరు అందించాలని దంతాలపల్లి, సూర్యాపేట రోడ్డుపై ఆందోళన చేశారు. మెజార్టీ ఫుల్లుగా గెలిచిన ఎమ్మెల్యే నీళ్లు రాకపోవడంతో పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ పొల్లు పొల్లు దుమ్ము దుమ్ము అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే,అధికారులు వెంటనే స్పందించి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.