Listen to this article

జనం న్యూస్ జనవరి 11గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ :

కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో జరిగే సంక్రాంతి సంబరాల ఉత్సవాలకు విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు లక్ష రూపాయలు భారీ విరాళాన్ని శనివారం అందజేశారు. శ్రీరంగపట్నం గ్రామంలో రైజింగ్ వారియర్స్, రామాలయ, గౌరీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గౌరీచౌక్ వద్ద ఈ నెల 9వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలకు విరాళం ఇవ్వాలని రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు వద్దకు వచ్చి కోరారు. వెంటనే స్పందించిన కంబాల శ్రీనివాసరావు లక్ష రూపాయలు భారీ విరాళాన్ని కమిటీ సభ్యులకు శనివారం గోకవరం తంటి కొండ రోడ్డులోని సీఎండీ, బీజేపీ నియోజకవర్గ కార్యాలయం వద్ద అందజేశారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీరంగపట్నం గ్రామం అంటే నాకు ఎంతో ఇష్టమని, తన సొంత కుటుంబం లాంటిదని, అక్కడి ప్రజల్లో భక్తి భావాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నారు. ఏ పండగ, ఉత్సవాలు వచ్చిన సాంప్రదాయంగా అందరూ కలిసికట్టుగా నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప, ఇనకోటి బాపన్న దొర, తామర్ల రాంబాబు, వరసాల ప్రసాద్, డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ, కట్టా కళ్యాణ్, కమిటీ సభ్యులు, యువత తదితరులు పాల్గొన్నారు.