Listen to this article

జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా, మార్చ్ 5, (రిపోర్టర్ ప్రభాకర్): పద్మశ్రీ పురస్కారం కటించినందుకు గాను మంద కృష్ణ మాదిగ గారిని ఘనంగా సత్కరించిన మాదిగ ఎమ్మెల్యేలు. విజయవాడలోని తెదేపా సీనియర్ నేత, పోలీట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గారి నివాసంలో యం.ఆర్.పి.ఎస్.అధినేత మంద కృష్ణమాదిగ గారి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో మాదిగ సామాజిక వర్గ పెద్దలు వర్ల రామయ్య ( తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు), ఎమ్మెల్యేలు బూర్ల రామాంజినేయులు, ( ప్రత్తిపాడు), MS రాజు ( మడకశిర ), బండారు శ్రావణిశ్రీ (శింగనమల), బోనెల విజయచంద్ర ( పార్వతీపురం), వర్ల కుమార్ రాజా (పామర్రు), బొగ్గుల దస్తగిరి ( కోడుమూరు), గిత్తా జయసూర్య ( నంది కొట్కూరు) పాల్గొన్నారు. యం.ఆర్.పీ.ఎస్.జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ, యం . ఆర్.పీ.ఎస్.రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ తో పాటు యం.ఆర్.పీ.ఎస్.ప్రతినిధి బృందం సభ్యులు పాల్గొన్నారు.