

జనం న్యూస్ 05 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మంగళవారం విజయనగరం జిల్లా సమీపంలో ఉన్న పైడి భీమవరం అరబిందో ఫార్మా కంపెనీ 54వ జాతీయ భద్రతా వారోత్సవాలు లో భాగంగా విజయనగరం యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, అత్యవసర మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వచ్ఛంద రక్తదాన శిబిరం కు విశేష స్పందన లభించింది. జిల్లాలో రక్తం నిల్వలు కొరత కారణంగా మరియు రానున్న వేసవి కాలం దృష్ట్యా ,తలసేమియా పిల్లలు , గర్భిణి స్త్రీల కొరకు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు విజయనగరం యూత్ ఫౌండేషన్ అధ్యక్షులు షేక్.ఇల్తామాష్ తెలిపారు . రక్తదాన శిబిరానికి సహకరించిన అరబిందో ఫార్మా కంపెనీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రక్తదానం ప్రాణదానం తో సమానం అని, అరబిందో ఫార్మా కంపెనీ హెచ్ఆర్ తిరుమల రావు తెలియజేశారు.
ఈ రక్తదాన శిబిరంలో 216 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది. సేకరించిన రక్త నిల్వలు విజయ బ్లడ్ బ్యాంక్ కి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయనగరం యూత్ ఫౌండేషన్ సభ్యులు శివ వర్మ, అశోక్, సాయి, రాయల్ క్యాబ్స్ శరత్, పి.రఘు, రాము, ఎన్ రఘు ,విజయ్ , కళ్యాణ్, చంద్రిక, వినయ్ , విజయ బ్యాంక్ మేనేజర్ పుణ్యమంతుల శివ తదితరులు పాల్గొన్నారు.