అమలాపురంలో ముద్రగడ పద్మనాభంకు వైస్సార్సీపీ ఘన నివాళి

July 18, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ జూలై 18 ముమ్మిడివరం ప్రతినిధి సంతాప సభలో పాల్గొన్న పినిపే విశ్వరూప్, పినిపే శ్రీకాంత్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :అమలాపురం నియోజకవర్గం అమలాపురం గడియార స్తంభం దగ్గర మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం సంతాప సభ ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి, పి.ఎ.సి సభ్యులు, అమలాపురం పార్లమెంట్ ఇంచార్జ్ పినిపే విశ్వరూప్, అమలాపురం అసెంబ్లీ ఇంచార్జ్ పినిపే శ్రీకాంత్ హాజరై ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వైస్సార్సీపీ కార్యదర్శి వంటేడ్డు వెంకన్నాయుడు అధ్యక్షతన జరిగిన సంతాప సభలో పలువురు నేతలు మాట్లాడారు.ముద్రగడ పద్మనాభం తన జీవితాంతం ప్రజల కోసం, ముఖ్యంగా కాపు సామాజికవర్గ హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. ఆయన రాజకీయాల్లో ఎల్లప్పుడూ విలువలతో కూడిన రాజకీయం చేశారని, పదవుల కంటే ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా బతికారని గుర్తుచేశారు.ముద్రగడ చూపిన బాట, ఆయన పాటించిన విలువలు నేటి తరానికి ఆదర్శనీయమని, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవలు, పోరాటాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని పినిపే శ్రీకాంత్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేల్, కుడుపూడి సూర్యనారాయణరావు, మాజీ పార్లమెంటు సభ్యురాలు చింత అనురాధ, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, రాజోలు నియోజకవర్గ ఇంచార్జ్ పాముల రాజేశ్వరి, గన్నవరం నియోజకవర్గం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు,రాష్ట్ర వైయస్సార్ పార్టీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సిఇసి) సభ్యులు శ పితాని బాలకృష్ణ రాష్ట్ర కార్యదర్శులు కటకంశెట్టి ఆదిత్య, చెల్లుబోయిన శ్రీనివాసరావు, పాటీ శివ, కుడుపూడి బాబు, భరత్, మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ సత్యనాగేంద్ర మణి, పట్టణ అధ్యక్షులు సంసాని నాని, అల్లవరం మండల అధ్యక్షులు కొనుకు బాపూజీ, జడ్పీటీసీలు గెడ్డం సంపదరావు, కొనుకు గౌతమి, ఎంపీపీ ఇళ్ల శేషారావు, చీకట్ల కిషోర్, చొల్లంగి సుబ్బురాం, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు దొమ్మేటి సత్యమోహన్, జిన్నూరి వెంకటేశ్వరావు, వంగా గిరిజ, ఖాదర్, కల్వకొలను ఉమ, బాబీ, ఎర్రంశెట్టి ప్రసాద్, కర్రీ రాఘవ, దూడలా ఫణి, ముత్యాల వీరభద్రరావు మరియు వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, ముద్రగడ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.

🌐 Select Language:
📰 ePaper