కోనసీమ టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ జిల్లా పార్టీ బలోపేతంపై చర్చ
జనం న్యూస్, జూలై 18 ముమ్మిడివరం ప్రతినిధి – గ్రంధి నానాజీఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని సీఎం నివాసంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇంచార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి, రాష్ట్ర అటవీశాఖ కార్పొరేషన్ చైర్మన్ మరియు జోన్ 2 ఇంచార్జ్ రావు సుజయకృష్ణ రంగారావుతో కలిసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షులు గుత్తుల సాయి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కోనసీమ జిల్లాలోని నియోజకవర్గాల పార్టీ కేడర్ బలోపేతం, పార్టీ విధి విధానాల అమలు, రాబోయే కార్యక్రమాలపై చర్చించారు.జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు తాడి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు