బాధిత కుటుంబానికి బియ్యం అందజేత

July 18, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జులై 18( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )బీబీపేట్ మండలంలోనీ మాందాపూర్ గ్రామానికి చెందిన జోగిపేట సిద్దవ్వ ఈ మధ్యనే మరణించగా బాధిత కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని 12 వ వార్డ్ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, తెలుసుకోని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, కు తెలుపగా 50 కిలోల బియ్యం బాధిత కుటుంబానికి శనివారం రోజున అందించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు పందిరి శ్రీకాంత్ రెడ్డి, శివనూరి నర్సింలు, రొడ్డ బాబు, లావణ్య, గ్రామ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రోడ్డ రాజు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతర్ల రాజిరెడ్డి, నవీన్, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper