చిరంజీవి ఆర్య తొలి జన్మదిన వేడుకలకు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హాజరు చిన్నారిని ఆశీర్వదించిన ప్రజాప్రతినిధులు, నాయకులు.. అష్ట ఐశ్వర్యలతో వర్ధిల్లాలని ఆకాంక్ష
జనం న్యూస్ జులై 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పీఏసీ చైర్మన్, రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురంధర్ రెడ్డి మనవరాలు, ఎన్నారై సందీప్–వినూత్న దంపతుల ముద్దుల కుమార్తె చిరంజీవి ఆర్య తొలి జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే గాంధీ, ఆర్య అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో, ఎల్లప్పుడూ చిరునవ్వుతో సుఖసంతోషాలతో ఎదగాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో మాజీ కార్పొరేటర్ రోజా రంగారావు, భాస్కరరావు, సతీష్ రావు, కాంగ్రెస్ నాయకులు ఎన్. చంద్రకాంతరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జై శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు ఆర్. రామచంద్రరావు, డాక్టర్ ఎన్. వంశీ రెడ్డి, జి. నర్సింగరావు, జి. ప్రసాద్, ఆర్. కార్తీక్ రావు, శ్రీధర్, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వరరావు, సూర్యనారాయణ, పురుషోత్తం, కిషోర్‌తో పాటు కాలనీవాసులు, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమం అనంతరం జనంపల్లి పురంధర్ రెడ్డి మాట్లాడుతూ, తమ కుటుంబ ఆనందాన్ని పంచుకోవడానికి విచ్చేసి చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, బంధువులు, మిత్రులు, కాలనీవాసులందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆప్యాయ వాతావరణంలో జరిగిన ఈ వేడుకలు ఆహ్లాదకరంగా సాగాయి.