

జనం న్యూస్ కోల్‌కతా:- : పశ్చిమ బెంగాల్లో తరగతి గదిలో అందరి సమక్షంలో ఒక మహిళా ప్రొఫెసర్ తన విద్యార్థిని వివాహం చేసుకుంటున్న దృశ్యం సంచలనం సృష్టించింది. దండలు మార్చుకోవడం, ఏడడుగులు నడవడం వంటివి సైతం ఆ వీడియోలో ఉండటంతో యూనివర్సిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటన కోల్‌కతాకు 150 కిలోమీటర్ల దూరంలోని నడియా లోని హరింఘట టెక్నాలజీ కాలేజీలో చోటు చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. పెండ్లికూతురు వేషధారణలో మెడలో దండలతో ఉన్న మహిళను ప్రొఫెసర్ పాయల్ బెనర్జీగా గుర్తించారు. అయితే ఇది నిజమైన వివాహం కాదని, పాఠ్యాంశ బోధనలో ఇంటర్నల్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించినదని ఆమె స్పష్టం చేశారు. దీంతో ప్రొఫెసర్‌ను కాలేజీ యాజమాన్యం తాత్కాలికంగా సెలవుపై పంపించి, విచారణ జరుపుతున్నది.