తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్
జనం న్యూస్ 03.
ఈ కార్యక్రమానికి గ్రామ మాజీ సర్పంచ్ నర్సింలు అధ్యక్షత వహించారు. వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఎరువులు, పురుగుమందుల సరైన వినియోగంపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.సదస్సులో స్కాట్ అగ్రి టెక్ ఫర్టిలైజర్స్ ప్రతినిధులు మాట్లాడుతూ పంటలకు అవసరమైన ఎరువులు, మందులను శాస్త్రీయ పద్ధతుల్లో వినియోగిస్తే దిగుబడులు పెరగడంతో పాటు ఖర్చులు కూడా తగ్గుతాయని వివరించారు. మట్టి పరీక్షల ప్రాముఖ్యత, పంట దశల వారీగా ఉపయోగించాల్సిన మందులు, పంటలకు వచ్చే సాధారణ తెగుళ్లు మరియు వాటి నివారణ మార్గాలపై రైతులకు స్పష్టంగా అవగాహన కల్పించారు.మాజీ సర్పంచ్ నర్సింలు మాట్లాడుతూ రైతులు ఆధునిక వ్యవసాయ విధానాలను అవలంబిస్తూ, నిపుణుల సూచనలు పాటిస్తే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని అన్నారు. ఇటువంటి అవగాహన సదస్సులు రైతులకు ఎంతో ఉపయోగకరమని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అగ్రి టెక్ ఫర్టిలైజర్స్ సంస్థ రైతుల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతుందని ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమం.ఆర్ ఎం శ్రీకాంత్ తెలియడం జరిగింది


