ఆక్వా రైతుల సమస్యలపై యానాంలో ముఖాముఖి సమావేశం

July 13, 2026 | తెలంగాణ

జనం న్యూస్ :* జూలై 13 ముమ్మిడివరం ప్రతినిధి నఆక్వా రైతుల సమస్యలపై ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ అధ్యక్షతన ఈరోజు ముఖాముఖి యానంలో సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ పాల్గొని ఆక్వా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సమావేశంలో పి.ఎ.సి సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పితాని బాలకృష్ణ ,అమలాపురం పార్లిమెంట్ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి, గన్నవరం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, రాజోలు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పాముల రాజేశ్వరి, మాజీ ఎంపీ చింతా అనురాధ, అమలాపురం పరిశీలకులు కటకంశెట్టి ఆదిత్య, రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షులు జిన్నూరి బాబీ, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, చింతలపాటి శ్రీనివాసరాజు, ధంగేటి రాంబాబు, వంటెద్దు వెంకన్నాయుడు, ఎస్.ఈ.సి సభ్యులు కుడుపూడి బాబు, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు జిన్నూరి వెంకటేశ్వరరావు, వై దొరబాబు, రాష్ట్ర లీగల్ సెల్ సంయుక్త కార్యదర్శి చొల్లంగి సుబ్బురాం తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper