విద్యా సంవత్సరంలో జిల్లాలో ఫస్ట్ మూవీ షో.. 680 మంది విద్యార్థులతో శ్రీవాణి స్కూల్

July 13, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ; 13 జూలై సోమవారం ;సిద్ధిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;విద్యార్థుల్లో సృజనాత్మకత, మంచి విలువలు, ఆలోచనా శక్తిని పెంపొందించే లక్ష్యంతో శ్రీవాణి స్కూల్, భారత్‌నగర్, సిద్ధిపేట ఆధ్వర్యంలో ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో తొలిసారిగా 680 మంది విద్యార్థులను బాలాజీ టాకీస్, సిద్ధిపేటకు తీసుకెళ్లి “అప్పు – ది క్రేజీ బాయ్” చిత్రాన్ని ప్రదర్శించారు. ఉదయం 9 గంటలకు విద్యార్థులను థియేటర్‌కు తరలించారు. విద్యార్థులు చిత్రాన్ని ఆసక్తిగా వీక్షిస్తూ ఎంతో ఆనందించారు. సినిమాలోని సందేశాలు, విలువలు, జీవిత పాఠాలను నేర్చుకున్నారు.ఈ సందర్భంగా శ్రీవాణి స్కూల్ డైరెక్టర్ సి. హెచ్. సత్యం మాట్లాడుతూ, “విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు జీవిత విలువలను నేర్పే అనుభవాలు కూడా అవసరం. మంచి సందేశం ఉన్న చిత్రాలు పిల్లల్లో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయి. అందుకే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాం.” అని తెలిపారు.ఈ చిత్రంలో జంతు సంరక్షణ, ప్రకృతి పరిరక్షణ, మూగజీవాలపై ప్రేమ, కరుణ వంటి విలువలను హృదయానికి హత్తుకునే విధంగా చూపించారు. జంతువులను ప్రేమించాలి, వాటిని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని ఈ చిత్రం బలంగా అందించింది.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper