ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికులకు భద్రత కల్పించాలి : ఏఐటీ యూసీ రాష్ట్ర నేత కోన లక్ష్మణ్

July 13, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూలై 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ; ఆర్టీసీ కాంటాక్ట్ కార్మికులకు భద్రత కల్పించాలని, కనీస వేతనాలు 26,000 అమలు చేయాలని, ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్, ఆర్టీసీ జిల్లా రహణ శాఖ అధికారి కార్యాలయంలో డి పి టి ఓ సీనియర్ అసిస్టెంట్, సూర్యారావు, డిపో అసిస్టెంట్ మేనేజర్ కు కలిసి వినతిపత్రం సమర్పించారు* ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోలో మెకానికులుగా స్వీపర్లుగా అసిస్టెంట్ మెకానికల్ గా పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంలోనూ పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ అమలు చేయడంలో ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు.కిలోమీటర్లు సంబంధం లేకుండా బస్సు పాసులు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఆర్టీసీ ఆసుపత్రులలో వైద్య సౌకర్యాలు కల్పించాలి. ఉద్యోగులందరికీ మేనేజ్మెంట్ ద్వారా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి,. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ప్రతినెలా 5వ తేదీన జీతాలు చెల్లించే విధంగా ఏర్పాటు చేయాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు మరణించిన వారికి మేనేజ్ మెంట్ ద్వారా ఎక్స్ గ్రేషియా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.పైన తెల్పిన డిమాండ్లను పరిష్కారం చేయనిచో రానున్న రోజులలో పెద్దఎత్తున ధర్నాలు, సమ్మెలు, ఛలో విజయవాడ కార్యక్రమాలు చేయుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు కార్యక్రమం లో ఏఐటీయూసీ నాయకులు వాయిబోయిన శేఖర్, అజయ్, అవుట్ సోర్సింగ్ నాయకులు విశ్వేశ్వరరావు , గంగారాం,కే శంకర్రావు, ఎస్ ఆనందబాబు, ఈ రాము,ఎల్ సతీషు,ఎన్ శేషు, పి రోహిత్
, పి సతీష్ బాబు, సిహెచ్ అప్పల ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.//

🌐 Select Language:
📰 ePaper