తెలంగాణ CEO మార్గదర్శకాల గణన ఫారమ్ పూరించిన TPCC సమన్వయకర్త మహమ్మద్ గౌస్
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం జులై 13. 07. 2026జహీరాబాద్ నియోజకవర్గం: జర సంఘం మండలం తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఓటరు జాబితా ప్రత్యేక గణన కార్యక్రమంలో భాగంగా TPCC సమన్వయకర్త మహమ్మద్ గౌస్ తన స్వగ్రామమైన గినియార్‌పల్లిలో గణన ఫారమ్‌ను పూరించి సమర్పించారు. గ్రామ ప్రజల్లో ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంపొందించేందుకు ఆయన స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కుమ్మశ్రీ రాజేశ్వరి గోపాల్, వార్డు సభ్యులు నయీముద్దీన్, దత్తురెడ్డి, గ్రామ పెద్దలు, ప్రజల సమక్షంలో బూత్ లెవల్ అధికారి (BLO) అరుణకు గణన పత్రాన్ని అధికారికంగా అందజేశారు. అనంతరం మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ, ప్రతి అర్హత కలిగిన ఓటరు తన వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవడం ప్రజాస్వామ్య బలోపేతానికి ఎంతో అవసరమని అన్నారు. తెలంగాణ CEO సూచనల మేరకు నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక గణన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇంటింటికీ వచ్చే BLOలకు అవసరమైన సమాచారం అందించి గణన ఫారమ్‌లను తప్పనిసరిగా పూరించాలని ఆయన పిలుపునిచ్చారు.గ్రామ సర్పంచ్ రాజేశ్వరి గోపాల్ మాట్లాడుతూ, ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలంటే ప్రతి కుటుంబం తమ వివరాలను పరిశీలించి, అవసరమైన సవరణలు, చేర్పులు, తొలగింపులు చేయించుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొని గణన ప్రక్రియను విజయవంతం చేయాలని సంకల్పించారు. తెలంగాణ ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక గణన కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రతి అర్హత కలిగిన ఓటరు బాధ్యతగా పాల్గొని గణన ఫారమ్‌లను సమర్పించాలని పలువురు అభిప్రాయపడ్డారు