పాలమూరు యూనివర్సిటీలోనే జాతీయ సెమినార్ నిర్వహించాలి

July 18, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 18 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ; జాతీయ సెమినార్ తో యూనివర్సిటీ అభివృద్ధికి ముందడుగు బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురువ పల్లయ్య వచ్చిన అవకాశాన్ని యూనివర్సిటీకే దక్కాలి. యూనివర్సిటీకి అతిథులు 1000 మంది వచ్చినా కూడా అకామిడేషన్ ఉంది. 171 ఎకరాలలో మంచి క్యాంపస్ వాతావరణం ఉన్నది. ఇంతకన్నా ఏం కావాలి జాతీయ సెమినార్ నిర్వహించేందుకు లేనిపక్షంలో అన్ని విద్యార్థి సంఘాలతో కలుపుకొని నిరాహార దీక్షలు చేపడతాం.పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థులతో కలిసి పాలమూరు యూనివర్సిటీలోనే జాతీయ సెమినార్ నిర్వహించాలని బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిరసన తెలిపి డిమాండ్ చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురువ పల్లయ్య బి ఆర్ యస్ వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు యూనివర్సిటీ ఇంచార్జి కురువ పల్లయ్య మాట్లాడుతూ జాతీయ సెమినార్ వలన యూనివర్సిటీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది.ఆగస్టు 7,8 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సెమినార్‌ను షాద్‌నగర్ సమీపంలోని కన్హ శాంతివనంలో నిర్వహించడం సరైన నిర్ణయం కాదు అని అన్నారుయూనివర్సిటీలో సెమినార్ ను నిర్వహిస్తే ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తే యూనివర్సిటీలో ఉన్న మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఇంత పెద్ద స్థాయిలో సమావేశం నిర్వహించే అవకాశం యూనివర్సిటీకి వచ్చినప్పుడు యూనివర్సిటీ పరిధిలోని నిర్వహించాలని అన్నారు.
యూనివర్సిటీ అధికారుల వైఫల్యం తోటే ఇక్కడ నిర్వహించాల్సిన సెమినార్ వేదిక మారిందని,దీనికి యూనివర్సిటీ వీసి,రిజిస్ట్రార్ బాధ్యత వహించాలని లేని పక్షంలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పోరాటం చేస్తాం చేస్తామని అన్నారు. సొంత జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు యూనివర్సిటీలోనే జాతీయ సెమినార్ ను నిర్వహించే విధంగా తాను కూడా యూనివర్సిటీకి వచ్చే విధంగా యూనివర్సిటీ అధికారులకు సూచించాలని,ఎట్టి పరిస్థితుల్లో సెమినార్ కన్హ శాంతివనం దగ్గర నిర్వహించవద్దని అన్నారు.యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల యూనివర్సిటీలో జరగాల్సిన సెమినార్ షాద్నగర్ కన్హ శాంతి వనంలో నిర్వహించడం ఏమిటని ఆ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేసుకొని యూనివర్సిటీ కేంద్రంగానే జాతీయ సెమినార్ ను నిర్వహించాలని తెలిపారు పాలమూరు ప్రాంత ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ఉన్న పాలమూరు యూనివర్సిటీని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేయాలంటే ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను యూనివర్సిటీలోనే నిర్వహించడం అవసరమని పేర్కొన్నారు. వేలాది మంది విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం కల్పించేందుకు యూనివర్సిటీనే సరైన వేదిక అని అభిప్రాయపడ్డారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 7 8 తేదీల్లో పాలమూరు యూనివర్సిటీకి విచ్చేసి జాతీయ సెమినార్‌ను ప్రారంభించాలని పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన హామీలను ప్రకటించాలని విజ్ఞప్తి చేశాయిఅదేవిధంగా పాలమూరు యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని, కన్హ శాంతివనం స్థానంలో పాలమూరు యూనివర్సిటీలోనే జాతీయ సెమినార్ నిర్వహించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారుజాతీయ సెమినార్ కు పాలమూరు యూనివర్సిటీ వేదికని మొదటగా ప్రకటించిన మాట మీద నిలబడాలని ప్రకటించేంతవరకు దశలవారీగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు లేనిపక్షంలో అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని యూనివర్సిటీని బందు చేస్తామని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి పీయు అధ్యక్షుడు గడ్డం భరత్ బాబు కొమ్ము రంగస్వామి దత్తు,ఆంజనేయులు,ప్రతాప్ రమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper